యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కు భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
సిద్దిపేట్ టైమ్స్ కోహెడ:
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం లో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగాళ్లపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ భూమి పూజ చేసారు .ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు మంచి రోజు కాబట్టి కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ చేస్తున్నాం జిఓ వచ్చాక ఉప ముఖ్యమంత్రి తో శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం .ఇంటి గ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి భూమి కావాలి అనగానే నిర్మాణానికి అవసరం అయిన భూమి తంగళ్ళపల్లి గ్రామం లో వుంది అనగానే అధికారులను పంపించి సర్వే చేయించి ప్రపోజల్ తీసుకున్నాం. తంగళ్లపల్లి నుండి బడ్డిపడుగా వరకు ఉన్న రహదరిని రెండు లైన్ల రహదారి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని అన్నారు .గత 10 సంవత్సరాల్లో విద్య వ్యవస్థ నిర్లక్ష్యం అయినది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 27 కోట్లతో పాఠశాలల్లో చిన్న చిన్న మౌలిక వసతులు కలిపించం పాఠశాల లో కరెంట్ బిల్లుల బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది కొత్తగా 10వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం గురుకులాలు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగు పరిచాము కొత్త అకడమిక్ సంవత్సరం మొదలు అయ్యేలోగా పాఠశాల నిర్మాణం పూర్తి కావాలి. హుస్నాబాద్ ను వ్యవసాయ పర్యావరణ మరియు ఆర్థిక క కేంద్రంగా తీర్చిదిద్దుతం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రామూర్తి , కోహెడ తహసిల్దార్ సురేఖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య బండిపెళ్లి నారాయణ సోషల్ మీడియా అధ్యక్షుడు అబ్దుల్ రఫీ, పాము శ్రీకాంత్ పులి రాజు నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.






