తెలంగాణ అక్కచెల్లెళ్లకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ అక్క చెల్లెళ్ళకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించె గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఎల్లలు దాటుతూ దేశ విదేశాల్లో కూడా పండగను జరుపుకుంటుండడం సంతోషదాయకం అన్నారు. రంగురంగుల పూలతో గ్రామగ్రామాన సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల నిండు కుండలా ఉండడంతో బతుకమ్మ లు వేసే సమయంలో మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.