జిల్లా ప్రభుత్వ న్యాయ వాదిగా హరి హర రావు..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్ట్ మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్ట్‌కు గవర్నమెంట్ ప్లీడర్‌గా సీనియర్ అడ్వకేట్ ఎం.హరి హర రావు నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరి హర రావు సీనియర్ న్యాయవాది. సిద్దిపేట జిల్లా సిద్దిపేటలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు మరియు అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టుకు ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వం తరపున సివిల్ కేసులను చూసేందుకు, పదవి బాధ్యతలు స్వీకరించిన నుండి మూడు సంవత్సరాల పాటు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జిపి గా కొనసాగనున్నట్లు జీఓ జారి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోండ సురేఖ, వేము నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, ఎమ్మెల్సి రఘోత్తం రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.