హైదరాబాదులో ఇంటింటికీ ఆర్టీసి కార్గో సేవలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీజి ఎస్ ఆర్టీసీ) అధ్వర్యంలో ఇంటింటికీ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థ కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్స్ మేనేజర్ రామారావు అన్నారు. హుస్నాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత వర్తక వ్యాపారస్తులకు మరియు వినియోగదారులకు టీజీఎస్ ఆర్టిసి లాజిస్టిక్స్ వారు దసరా సందర్భంగా నూతనంగా హైదరాబాద్ జంట నగరాలలో హోమ్ డెలివరీ మరియు పిక్ అప్ ప్రారంభిస్తున్నామని తెలిపారు, అలాగే దసరా సందర్భంగా మీరు బుకింగ్ చేసుకున్న పార్సల్స్ ని వెనువెంటనే సంబంధిత ప్రాంతానికి చేరవేయుటకు హుస్నాబాద్ టీ జి ఎస్ ఆర్ టి సి, లాజిస్టిక్స్ ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు, ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్స్ మేనేజర్ రామారావు తెలియజేశారు. దీంతోపాటుగా కోహెడ 9441975869, సైదాపూర్ 9515619584, చిగురుమామిడి 9701811950 నంబర్లను సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఇతర వివరాలకు హుస్నాబాద్ ఆర్టీసి డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సురేష్ 9154298673 ను సంప్రదించాలని తెలిపారు.