పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర సమరయోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై కొండ లక్ష్మణ్ బాపూజీ ఫోటో కి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు అన్నారు. తెలంగాణ సాధన కోసం అప్పటి ఏడవ నిజాం నవాబు రజాకార్లతో పోరాటం చేసిన ఘనత కొండ లక్ష్మణ్ బాపూజీ కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్స్ స్వర్ణలత,పద్మ గారు, రవి, దొడ్డి శ్రీనివాస్, వల్లపు రాజు, కో ఆప్షన్ మెంబర్స్ శంకర్ రెడ్డి, అయూబ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.