వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి
బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. నేటికీ కూడా స్వయంగా మంత్రి నియోజకవర్గంలోనే పాలకవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని అదేవిధంగా రైతుల కష్టాలు పట్టించుకునే నాధుడే లేడన్నారు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకుండా దళారులు దోచుకుంటున్నారని, బహిరంగ కొనుగోళ్లకు పాల్పడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నారు. దీనిపై మంత్రి స్పందించి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.