ఘనంగా ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు ..
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

“ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని” పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణ కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. బుదవారం రోజున ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణంలోని వినాయక మెడికల్ స్టోర్స్ లో ఫార్మసిస్ట్ కోర్స్ పూర్తి చేసి ఫార్మసీ రంగంలో ఉన్న సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫార్మసీరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఫార్మసిస్ట్ లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. అనంతరం ఫార్మసిస్ట్ సభ్యులకు మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు బింగి శ్రీనివాస్ శాలువాలతో సత్కరించి ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దాసరి వినోద్, కనుకుంట్ల శ్రీనివాస్, రావుల రంజిత్, బింగి వెంకటరమణ, వేముల సంధ్య, వేముల మహేష్, బండారి దినేష్, ఇజ్జగిరి శ్రీకాంత్, పడాల రామకృష్ణ, కూకట్ల భరద్వాజ్, కనుకుంట్ల శశి కిరణ్, నూక వంశీ తదితరులు పాల్గొన్నారు.