రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ… ఇష్ట రాజ్యాంగ అక్రమ లేఔట్లు, అసైన్డ్ ప్రభుత్వ భూముల పట్టాలు, ఇంటి నెంబర్ తో ఎక్కడో ఉన్న సర్వే నంబర్లలో భూములు రిజిస్ట్రేషన్ చేయడం, మార్ట్ గేజ్ సర్టిఫికెట్లకు, మ్యారేజ్ సర్టిఫికెట్లకు, వ్యక్తిగత ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు ముడుపులు ఇవ్వందే సిబ్బంది అధికారులు పనిచేయని పరిస్థితి ఉందన్నారు. వెంటనే అవినీతికి పాల్పడుతున్న అధికారుల పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని జిల్లా రిజిస్ట్రేషన్ అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో B S P పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గం ఇంచార్జి, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్య దర్శి ఎలుగందుల శంకర్, నియోజకవర్గం కన్వినర్ వేల్పుల రాజు, సీనియర్ నాయకులు సుధాకర్, మండలం అధ్యక్షులు, దుండ్ర రాంబాబు, జిల్లా నాయకులు డేగల వెంకటేష్, డేగల సతీష్, చంచల విక్రమ్, సుంకర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
