ఒకరి నిర్లక్ష్యానికి మరొకరి బలి
విద్యుదాఘాతంతో స్తంభం పైనే లైన్మెన్ మృతి
సిద్దిపేట్ టైమ్స్ డెస్క్:
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండా పరిధిలో ఓ జూనియర్ లైన్మెన్ నిర్లక్ష్యంతో విద్యుత్ షాక్ కు గురై ప్రైవేట్ ఎలక్ట్రిషన్ తిరుపతి తండ్రి పేరు వెంకట్ రామ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. జూనియర్ లైన్మెన్ రాజేందర్ విద్యుత్ మరమ్మత్తు కోసం విధులకు వెళ్లకుండా ప్రైవేట్ ఎలక్ట్రిషన్ తిరుపతికి చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఎల్ సి సరిగా తీసుకోకుండా తిరుపతి విద్యుత్ కరెంటు పోల్ ఎక్కడంతో విద్యుత్ షాక్ కు గురై మంగళవారం రాత్రి అక్కడికక్కడే మృతి చెందాడని వెల్లడించారు. రాత్రి నుండి మృతదేహాన్ని తీయకుండా ఘటన స్థలంలోనే మృత దేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
