మంత్రి “పొన్నం”కు కృతజ్ఞతలు తెలిపిన తోటపల్లి గ్రామస్థులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని కొన్ని గ్రామాలకు బీటీ రోడ్లు, బ్రిడ్జిలు సాంక్షన్ చేస్తూ అందులో భాగంగా తోటపల్లి గ్రామానికి బిటి రోడ్డు వంతెన నిర్మాణానికి గాను రెండు కోట్ల 57 లక్షల రూపాయలు తోటపల్లి గ్రామానికి కేటాయించినందుకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల కల అని దారి లేక పూసవేర్ల పల్లె దగ్గర ఉన్న కొన్ని ఇండ్లు హుస్నాబాద్ కు మరియు తోటపల్లికి తరలి పోయాయని క్రమ క్రమంగా అక్కడ పల్లె ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చిందని అక్కడ ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చాలా దూరం ఉందని కొన్ని సందర్భాల్లో సంబంధాలు కూడ క్యాన్సల్ కావడం జరిగిందని, రాత్రి సమయంలో ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ రాని పరిస్థితి అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గ్రామనికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో గాని ఈ సమస్యలు ఎంత మంది నాయకులకు విన్నవించినా ఓట్ల కోసం తప్ప అభివృద్ధి పై దృష్టి పెట్టలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ప్రజల బాదలు ఎవ్వరు పట్టించుకులేదన్నారు. ఈ గ్రామ పరిస్థితులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకు పోగ వారు స్పందించి ఇచ్చిన హామీని మరవకుండా నెరవేర్చారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయ పనులకు వెళ్లే వారికి, గౌడన్నలకు, గొర్ల మేతకు యాద వులకు చాలా ఇబ్బంది కరంగా ఉండేదిని, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నిండింది అంటే ఇక్కడున్న ప్రజలకు పట్టరాని ఇబ్బందులు ఉండేవని, వీటినంటింటి దృష్టిలో పెట్టుకొని కిలోమీటర్ నర రహదారితో పాటు బ్రిడ్జి నిర్మాణానికి బడ్జెట్ కేటాయించినం దుకు మంత్రి పోన్నం ప్రభాకర్ కు గ్రామ ప్రజలు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.
