పట్టణ ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలి
మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జరిగిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్, పోలీస్ బృందంతో కలిసి పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో రాలిపోయిన ఆకులను సేంద్రియ ఎరువు తయారీ కేంద్రానికి తరలించారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… పట్టణ ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని, వారంలో రెండు గంటల పాటు శ్రమ దాన కార్యక్రమం చేయాలని, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను మీరే శుభ్ర పరుచుకోవాలని, ఇంటి నుండి వచ్చే చెత్తను మూడు రకాలుగా తడి చెత్త, పొడి చెత్త మరియు హానికరమైన చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వాడకూడదని, హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతలో ముందు ఉంచాలని, స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలని, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్పర్సన్ అనిత, వార్డు కౌన్సిలర్ భాగ్య రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ మహేష్, మున్సిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్లు, మెప్మ ఆర్పీ, పోలీస్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

