ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం
కోహెడలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 12 వర్ధంతి వేడుకలు
ఘనంగా నివాళులు అర్పించిన పద్మశాలి సంఘం మరియు మండల నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ జిల్లా :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి వేడుకలు కోహెడ మండల పద్మశాలి సంఘం, మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యుడు అర్షనపల్లి జయకృష్ణ వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జయకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రివర్గంలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ కు బాపూజీ పేరు పెట్టడం శుభ సూచకమని ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికీ పద్మశాలి సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జన్మదినం రోజు సెప్టెంబర్ 27 న రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనంద దయాకమని పేర్కొన్నారు. బాపూజీ తెలంగాణ కోసం ఎప్పుడు కల కనేవాడని ఆ కల నెరవేరక ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవడం చాలా బాధాకరమని భావోద్వేగానికి లోనయ్యారు. వందేమాతరం, క్విట్ ఇండియా ఉద్యమాలలో బాపూజీ భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమానికి వారి నివాసం జలదృశ్యం వేదికైందని, వారి పోరాట స్ఫూర్తి మార్గదర్శకమని, తెలంగాణ రావడానికి బాపూజీ ఆధ్యులు అని, బాపూజీ త్యాగాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరవదని పేర్కొన్నారు. మూడు తరాల ఉద్యమ యోధుడు బాపూజీ ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఉద్యమ స్ఫూర్తిని పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోహెడ గ్రామ మాజీ సర్పంచ్ గోరిట్యాల లక్ష్మణ్, వెంకటరమణ, బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షులు గోవిందు సురేష్, మనేషం, బీజేపీ మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం, జిల్లా నాయకులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెరియాల రాజేశ్వర్ రావు, వార్డు సభ్యులు బండ జగదీశ్, వెంకటస్వామి, పెరియాల కాంతారావు, మాజీ వార్డు సభ్యులు ఇల్లందుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు, కొండబత్తిని రాజలింగం, సతీష్, హోటల్ శంకర్, నరాల అశోక్, ఆకుబత్తిన రాజు, మాటేటి వేణు, తదితరులు పాల్గొన్నారు.