హుస్నాబాద్ లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను శనివారం సాయంత్రం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ఆర్డీవో, పోలీస్ అధికారులు, కౌన్సిలర్లు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనం చేసే ఎల్లమ్మ చెరువు వద్ద లైటింగ్ సిస్టమ్, భారీ కేడ్లు, నిమజ్జనం రోజు ప్రాణం నష్టం జరగకుండా గజ ఈతగాళ్ల ఏర్పట్ల పై అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..సోమవారం హుస్నాబాద్ పట్టణంలో జరిగే గణేష్ నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మండప నిర్వాహకులు సహకరించి ప్రశాంతంగా, ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా చెరువు వద్ద కూడా ఈతగాల్లను పెట్టాలని.. ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం అయినా వెంటనే వ్యర్థాలను తీసేయేడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని మరియు లైటింగ్ సిస్టమ్, విద్యుత్, భారీకేడ్లు ఏర్పాట్లు చేయాలని, పట్టణ ప్రజలకు నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ ప్రజలపైన ఆదేవుడి ఆశీస్సులు ఉండలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలనీ కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత, కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, బొలిశెట్టి శివయ్య, కోమటి సత్యనారాయణ, హుస్నాబాద్ ఏసిపి సతీష్, ఎండి హసన్, కౌన్సిలర్లు సరోజన, వల్లపు రాజు, ఆర్ డి ఓ, కమిషనర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

