పారిశుద్ధ పనులు పడకేస్తే చూస్తూ ఊరుకునేది లేదు
మున్సిపల్ అధికారులు పారిశుద్ధ పనులు పట్టించుకోకపోతే పోరాటం తప్పదు
వైరల్ ఫీవర్ వలన ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు
బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య పనులు పడకేశాయని, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోతే పోరాటం తప్పదని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ లో వైరల్ జ్వరాల వలన ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న పట్టణంలోని జ్యోతినగర్ కు చెందిన పలువురుని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోతే పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. జ్యోతినగర్లో పారిశుద్ద పనులు పడకేసినట్టు కనపడుతుందనీ కాలనిలో డ్రైనేజిల్లో చెత్త కుడుకపోయి ఇండ్లలో నుంచి వచ్చిన మురుగు నీరు డ్రైనేజీ లోనే నిలిచిపోతుందన్నారు. దోమలు మురికి కాలువలలో నుండి ఇళ్ళల్లోకి వస్తున్నాయని అన్నారు. వారం రోజుల క్రితం కురిసిన వర్షం నీరు ఖాళీ స్థలాల్లో కుంటలుగా మారాయని, నీరు నిలువడంతో దోమలు పెరిగాయన్నారు. ఖాళీ స్థలాలలో మురికి కాలువలలో గడ్డి పెరిగిందని చెత్తా చెదారంతో నిండిపోయిందని అన్నారు. జ్యోతినగర్ మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంటుందని అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.








