స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో మండల స్థాయి క్రీడ పోటీలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హుస్నాబాద్ మండల స్థాయి క్రీడలు ఈ నెల 10,11&13 వ తేదీ లలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల ) మైదానాలలో 14 మరియు 17 సంవత్సరాల బాల బాలికల విభాగాలలో కబడ్డీ, ఖో – ఖో, వాలీ బాల్ మరియు అథ్లెటిక్స్ అంశాలలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు MEO టీ. దేసిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఆర్ శ్రీనివాస్ పిడి మరియు కె సత్యనారాయణ రెడ్డి పిడి తెలియజేశారు. ఈ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులు వయసు దృవీకరణ, బోనాఫైడ్ మరియు ఆధార జెరాక్సు తో హాజరు కావాలని కోరారు. కబడ్డీ కన్వీనర్ వి. వెంకట స్వామి PET నవభారత స్కూల్, వాలీబాల్ కన్వీనర్ గా రాజ రెడ్డి PET సెయింట్ జోసెఫ్ స్కూల్ , కె సత్యనారాయణ రెడ్డి పిడి ఖో- ఖో మరియు అథ్లెటిక్స్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. 10 వ తేదీన 14 సంవత్సరాల బాల బాలికల కు కబడ్డీ, ఖో ఖో మరియు వాల్ బాల్ పోటీలు, ఈ నెల 11 న 17 సంవత్సరాల బాల బాలికల కు కబడ్డీ, ఖో ఖో మరియు వాల్ బాల్ పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర మరియు బాలికల పాఠశాలల మైదానం లో మరియు 12 వ తేదీన అథ్లెటిక్స్ 14&17 సంవత్సరాల బాల బాలికల కు అథ్లెటిక్స్ అంశాలలో మిని స్టేడియం హుస్నాబాద్ లో నిర్వహిస్తున్నట్లు ఏం ఈ ఓ దేశీరెడ్డి మరియు SGF సెక్రటరీ ఆర్ శ్రీనివాస్ పిడి తెలియజేశారు.





