ఇండ్లలోకి నీరు, డ్రైనేజీ సమస్యలు తలెత్తడం గత ప్రభుత్వ వైఫల్యమే
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ;
ఇండ్లలోకి నీరు రావడం, డ్రైనేజీ సమస్యలు తలెత్తడం గత ప్రభుత్వ వైఫల్యమే అని పది సంవత్సరాలు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ డ్రైనేజీ సమస్యను పట్టణంలో ఏ మేరకు నివారించగలిగిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బంక చందు సూటిగా ప్రశ్నించారు. మంగళవారం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ తాను అన్న మాట నెరవేర్చకపోతే క్యాంపు ఆఫీసు ముందు ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెప్పడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ….గత ప్రభుత్వ పరిపాలనలో డ్రైనేజీ సమస్య పరిష్కరించకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇళ్లలోకి నీరు వచ్చిన బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించి చైర్మన్, కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఒక వైపు చర్యలు తీసుకుంటూ ఉంటే విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. పది సంవత్సరాలలో గత ప్రభుత్వం చేయలేని పనిని సంవత్సరం లోపే చేసి చూపించే సత్తా ఉన్న నాయకుడు పొన్నం ప్రభాకర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, మున్సిపల్ కౌన్సిలర్ బుఖ్య సరోజన, హుస్నాబాద్ సింగిల్ విండో డైరెక్టర్ కావ్య, వెంకటస్వామి, పోతుగంటి బాలయ్య, బికియా నాయక్, జవహర్లాల్, ముప్పిడి రాజిరెడ్డి, నాయిని రజిత, దూబాల శ్రీనివాస్ బైరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.