మాంటిస్సోరి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
హుస్నాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు చిన్ని కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ మన్నన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





