మోడల్ స్కూల్ లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున్ ఆకస్మిక తనిఖీ చేశారు. మోడల్ స్కూల్ లో ఉన్న టాయిలెట్లను పరిశీలించి విద్యార్థినులతో కమిషనర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం, తరగతుల నిర్వహణ, త్రాగే నీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం,ఇన్చార్జి స్కూల్ ప్రిన్సిపల్, వనమహోత్సవ సూపర్వైజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.