ఎల్లమ్మ చెరువు ఏటి కాల్వ పూడిక మరమత్తులు
వెంటనే చేపట్టాలి.
చెరువు కాల్వలో గడ్డి పూడిక మట్టితో నిండిపోయింది.
నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
తక్షణమే కాల్వ మరమ్మతు పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు, సిపిఐ నేత గడిపె మల్లేశ్ డిమాండ్.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ పట్టణంలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఎల్లమ్మ చెరువు ద్వారా హుస్నాబాద్ పట్టణంలోని కొత్త చెరువు, పల్లే చెరువు, దామేరకుంట, కాటమయ్య, పొట్లపల్లి, దేవేంద్ర నగర్, హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం, కొండాపూర్, నవాబుపేట గ్రామ శివారులోని వందలాది ఎకరాల వ్యవసాయ భూములకు ఎల్లమ్మ చెరువు ద్వారానే సాగునీరు అందుతాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ అన్నారు.
ఎల్లమ్మ చెరువు ఆయకట్టు రైతులు సిపిఐ హుస్నాబాద్ పట్టణ నాయకులతో కలిసి ఎల్లమ్మ చెరువు ఏటి కాలువలో పెరుకు పోయిన పూడిక మట్టితోపాటు, పచ్చిగడ్డి నిండిపోయి ఉండడం వల్ల ఎల్లమ్మ చెరువు కాలువ ద్వారా వచ్చే చెరువు, వరద నీరు అంతా పంట పోలాలకు రాకుండా నిలిచి పోయిందని గడిపె మల్లేశ్ అన్నారు. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఏటి కాలువలో పేరుకుపోయిన గడ్డి, అలము పుటికనే నిదర్శనమని రైతుల పట్ల నీటి పారుదల శాఖ అధికారుల అలసత్వం సరికాదని ఐబి అధికారుల పనితీరుపై గడిపె మల్లేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆయకట్టు రైతులు సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నావించిన రైతుల గోడు పట్టించుకోక పోవడం ఏమిటని ఐబి అధికారులను గడిపె మల్లేశ్ ప్రశ్నించారు. వెంటనే నీటి పారుదల శాఖ జిల్లా కలెక్టర్ ఉన్నాతాధికారులు డిఈ, ఏఈ స్పందించి ఎల్లమ్మ చెరువు ఏటి కాల్వను తక్షణమే పరిశీలించి కాల్వలో పెరుకు పోయిన పూడికతీత, పచ్చిగడ్డి తోలగింపు మరమత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు ఐబి అధికారులు కృషి చేయాలని లేకుంటే ఆయకట్టు రైతులు ప్రజలతో నీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట ప్రజా ఆందోళన చేపడుతామని నీటి పారుదల శాఖ అధికారులను గడిపె మల్లేశ్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు గంగుల రాజయ్య, విలసాగరం ఓదయ్య, గొర్ల రాజయ్య, రొడ్డ కనకయ్య, దొంతరవేని ఎల్లయ్య, కొట అశొక్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు కాల్వల ఎల్లయ్య సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, మేకల విజయ, దొంతరవేని రాజవ్వ, కామాద్రి సుజాత, దండుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.