ఘనంగా శ్రీ కనకదుర్గ దేవి విగ్రహ ప్రతిష్ట
సిద్ధిపేట టైమ్స్, సిద్ధిపేట రూరల్ :

సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకనకదుర్గాదేవి విగ్రహా ప్రతిష్ట ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈనెల 7న ప్రారంభమైన ఉత్సాలు శనివారం నిర్వహించే బోనాలతో ముగియనున్నాయి. మొదటి రోజున గణపతి పూజ, స్వస్తి పుణ్యహవాచనము, అగ్నిప్రతిష్ట, అఖండ దీపస్థాపన, యాగశాల ప్రవేశం, ధ్వజస్తంభ ప్రతిష్ట, అమ్మవారు, గణపతి విగ్రహాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా గ్రామంలోని భక్తులు విగ్రహాలపై నీళ్లుపోసి, మంగళహారతులు సమర్పించారు. రెండోరోజు హవనములు, మంత్రిపుష్పం తదిరత కార్యక్రమాలను నిర్వహించారు. మూడవరోజున స్థాపిత దేవాతా హోమం, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవోపేతంగా జరిపించారు. అనంతరం పూర్ణాహుతి జరిపించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు, గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, దుర్గాయూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

