తెలంగాణ మోడల్ స్కూల్లో “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్: పట్టణ పురపాలక సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ మోడల్ స్కూల్లో “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు అనగా డయేరియా, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుని సంప్రదించాలని, ఇంటిలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, విద్యార్థిని విద్యార్థులకి “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమం జీవితంలో ఒక భాగమని, ఈ ఐదు రోజులే కాకుండా ప్రతిరోజు స్వచ్ఛత ను పాటించాలని, ఆహారం వృధా చేయకూడదని, ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని, స్వచ్ఛదనం పచ్చదనం గురించి మీ తల్లిదండ్రులకు కూడా అవగాహన చేయాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి, తడి చెత్త తో స్కూల్లోనే ఆన్సెట్ కంపోస్టు ద్వారా ఎరువు తయారు చేసుకొని ‘వనమహోత్సవ’ కార్యక్రమంలో నాటిన మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చని, పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలియజేశారు. అలాగే చైర్పర్సన్ 15వ వార్డులో జ్వర సర్వే, కుక్కల సర్వేలో పాల్గొనడం జరిగింది. పట్టణంలోని అన్ని వార్డులలో సీజనల్ వ్యాధులపై అవగాహన, స్ప్రే చేయించడం, బ్లీచింగ్ చల్లడం మొదలైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, స్కూల్ ప్రిన్సిపాల్ అన్నపూర్ణ, మున్సిపల్ అధికారులు, మెప్మా రిసోర్స్ పర్సన్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.