హుస్నాబాద్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైన “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమం

సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు “స్వచ్ఛదనం పచ్చదనం” అనే కార్యక్రమం చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన ప్రారంభించారు. చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లుఅందరూ తమ తమ వార్డులలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికి తిరుగుతూ తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని, తడి చెత్తతో ఎరువు తయారు చేసుకోవాలని, ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్, కౌన్సిలర్స్, కో ఆప్షన్ మెంబెర్స్, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ Anm లు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, స్కూల్ మరియు కళాశాల విద్యార్థి విద్యార్థినులు అందరూ కలిసి గర్ల్స్ హై స్కూల్ నుండి గాంధీ చౌరస్తా వరకు స్వచ్ఛతపై స్లొగన్స్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గర్ల్స్ హైస్కూల్లో చైర్పర్సన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛత, సీజనల్ వ్యాధులపై, చెత్త విభజనపై, ప్లాస్టిక్ నిషేధం పై, మొక్కలు నాటడం మరియు సంరక్షించడంపై, అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ మరియు డిగ్రీ కళాశాలలో పిచ్చి మొక్కలను తొలగించడం, స్వీపింగ్ కార్యక్రమాలు చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్ పర్సన్ అనిత రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్స్ నలినీ దేవి, రమా దేవి, స్వర్ణలత, భాగ్య రెడ్డి, లావణ్య, పద్మ, వేణు, మ్యాదర బోయిన శ్రీనివాస్, రవి, దొడ్డి శ్రీనివాస్,గుళ్ళ రాజు, కల్పన, సరోజన, రత్నమాల, వల్లపు రాజు, రమేష్ , హరీష్, సుప్రజ, కో ఆప్షన్ మెంబర్స్ శంకర్ రెడ్డి, అయూబ్, శ్రీలత, లలిత, మున్సిపల్ అధికారులు, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, మెప్మా రిసోర్స్ పర్సన్, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, పట్టణ ప్రజలు, విద్యార్థులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

