- ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ల దందాపై ఉద్యమించండి
- ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి
- ఆకర్షణీయమైన టెక్నో కాన్సెప్ట్, ఎక్స్ప్లోరీకా, వరల్డ్, ఐఐటి జేఈఈ, సిబిఎస్సి, ఇంటర్నేషనల్ లాంటి పేర్లను తొలగించాలి
- పాఠశాలలలో పుస్తకాలు డ్రెస్సులు స్టేషనరీ వ్యాపారం ఆపాలి
- ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అడ్మిషన్ల డొనేషన్ల పేరుతో వేల రూపాయలు దండుకుంటున్న ప్రైవేట్ యజమాన్యాలు
- విద్యను వ్యాపారంగా మారుస్తూ కోట్ల రూపాయలకు పడగెత్తుతున్న ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు
- కరీంనగర్లో మధ్యతరగతి పిల్లలకు విద్య అందని ద్రాక్ష లాగా మారింది
- నిద్రమత్తులో విద్యాశాఖ అధికారులు
- లంబాడ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గగులోతు రాజు నాయక్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గుగులోతు రాజు నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా, ఫైర్ సేఫ్టీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుమతి లేకుండా, విద్యార్థులకు సరైన క్రీడా మైదానం ఏర్పాటు చేయకుండా, అపార్ట్మెంట్ లాంటి భవనాలలో తరగతులు నిర్వహించుకుంటూ ఒకే తరగతి గదిలో ఎక్కువమంది విద్యార్థులను చేర్పించుకుంటూ, విచ్చలవిడిగా టెక్నో కాన్సెప్ట్, ఎక్స్ప్లోరిక, వరల్డ్ ఐఐటి జేఈఈ, సి బి ఎస్ సి, వంటి రకరకాల తోక పేర్లను పెట్టి విద్యార్థుల తల్లిదండ్రు లు ఆకర్షించేలా ప్రచారాలు చేస్తూ ఆర్థిక దోపిడికి పాల్పడుతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని వారిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకే పేరు మీద నడుపుతున్న పాఠశాలలలో ఆ పేరు మీద అనేక హాస్టల్లో ఏర్పాటుచేసి అందులో ఉంటున్న విద్యార్థులకు సరైన భోజనం వసతి సౌకర్యాలు కల్పించకుండా చాలీచాలని వసతులు కల్పిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈ ప్రైవేట్ పాఠశాల హాస్టల్ల ఆగడాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు మరియు విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేయాలని అన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఈ ప్రైవేట్ పాఠశాలలపై త్వరలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ మరియు సెక్రెటరీ మరియు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఫిర్యాదులు చేస్తామన్నారు. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు సత్యం నాయక్, జిల్లా కార్యదర్శి మోతిలాల్, తిరుపతి నాయక్, కృష్ణ నాయక్, సక్రు నాయక్, వీరన్న నాయక్, శ్రీను నాయక్, జోహార్ లాల్ నాయక్, భీమా నాయక్, హర్యానాయక్, తదితర గిరిజన నాయకులు పాల్గొన్నారు.





