హుస్నాబాద్ 17వ వార్డులో లో వోల్టేజ్ సమస్యను అధిగమించుటకు కొత్తగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డు గణేష్ నగర్ లో లోఓల్టేజ్ సమస్యను అధిగమించడానికి కౌన్సిలర్ చొరవ తో కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. బుధవారం 17వ వార్డులో కౌన్సిలర్ వల్లపు రాజుకు కాలనీలో లోవోల్టేజీ సమస్య ఉందని పలువురు సమస్యను కౌన్సిలర్ దృష్టికి తేవడంతో వెంటనే స్పందించిన కౌన్సిలర్ వల్లపు రాజు సమస్యను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకొని 100 kv ట్రాన్స్ఫార్మర్ ను తొలగించి కొత్త 160 kv ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు కౌన్సిలర్ వల్లపు రాజు తోపాటు AE శశిధర్ రెడ్డి, ఏ డి ఈ దుర్గా శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ బుచ్చయ్య, లైన్మెన్ గుాల్ల ఆంజనేయులు, జేఎల్ఎం రాకేష్ కు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.