బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా హుస్నాబాద్ పట్టణ బిజెపి మాజీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు నియామకం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబుని బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. తక్షణమే వీరి నియామకం అమలులోకి వస్తుందని తెలిపారు. పార్టీ కోసం ఎస్సీల సమస్యలకు ఉదృతంగా పోరాటం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ నాకు రాష్ట్ర ఎస్సీ మోర్చాలో బాధ్యత కల్పించినందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కోండేటి శ్రీధర్ కి, సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి కి, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బొయినిపల్లి ప్రవీణ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కోండేటి శ్రీధర్ ని శాలువాతో సన్మానించారు. రాష్ట్రంలో ఎస్సీల యొక్క అభ్యున్నతికి, సమస్యల పట్ల పోరాడతానని, పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానని తెలిపారు.