గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సిద్దిపేట టైమ్స్ డెస్క్ (Jul 15, 2024):
తెలంగాణలో గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని నిరసన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. డీఎస్సీ ముగిసిన రెండు రోజులకే గ్రూప్స్ పరీక్షలు ఉన్నాయన్నారు. ఎక్కువ శాతం DSC అభ్యర్థులే రాయనున్నారని ఎగ్జామ్ వాయిదా వేయడంలో ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని ఓ ప్రకటనలో మండిపడ్డారు. గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలని ఆయన కోరారు.