హుస్నాబాద్ 17వ వార్డులో పురపాలక సంఘ ఆధ్వర్యంలో “సఫాయి అప్నా బీమారి భగవో” కార్యక్రమం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బుధవారం రోజు హుస్నాబాద్ పట్టణంలో 17వ వార్డులోని శివాలయం లో పురపాలక సంఘ ఆధ్వర్యంలో సఫాయి అప్నా బీమారి భగవో (పరిశుభ్రతను పాటించండి రోగాలను తరిమికొట్టండి) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై శివాలయంలో వార్డు ప్రజలతో కలిసి దేవాలయ ఆవరణలో శుభ్రపరచారు. దేవాలయంలో ఉన్న చెత్తను తడి చెత్త మరియు పొడి చెత్త వేరు చేసి తరలించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు మొక్కలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలం కావున సీజనల్ వ్యాధులు అనగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, డయేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున ముందస్తుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్కూల్ పిల్లలు అయితే చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్, వార్డు కౌన్సిలర్ వల్లపు రాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, వనమహోత్సవ సూపర్వైజర్ శంకర్, పర్యావరణాధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్ భవాని, జవాన్ సారయ్య , వార్డు ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






