రెండు నెలలుగా పనిచేయని రెండు వాటర్ ప్లాంట్లు
త్రాగునీరు దొరకక ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు
బాల వికాస వాటర్ ప్లాంట్ లను పునరుద్ధరించాలి
హుస్నాబాద్ నియోజకవర్గ బీసీ సంఘాల నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..హుస్నాబాద్ పట్టణంలో మూడు బాలవికాస ఫ్లాంట్ లు ఉన్నాయి. ఇందులో ఆరేపల్లి మరియు బస్ డిపో దగ్గర గల వాటర్ ప్లాంట్లు లు గత రెండు నెలలు గా ప్రజలకు త్రాగునీరు అందించడం లేదు. పట్టణంలో గతంలో ఈ ప్లాంట్ లు లేకముందు సహజంగా గ్రామపంచాయతీ సురక్షిత నీరు తాగేవారు. కానీ ఇప్పుడు పట్టణ ప్రజలకు బాలవికాస త్రాగునీరు అలవాటు చేశారు. గత రెండు నెలలుగా ఈఫ్లాంట్ లు బందు కావడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లాభదాయకంగా ఉన్న ఈ ప్లాంట్ల మూసివేతకు కారణమేమిటో ఇట్టి ప్లాంట్ల చైర్మన్లు ఇప్పటికి చెప్పడం లేదు. ఇట్టి ప్లాంట్ల లెక్కలు లేవు. ఎన్నికలు జరగక 8 ఏళ్లవుతుంది. బాలవికాస వాటర్ ప్లాంట్ల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సర్పంచ్ K..లింగమూర్తి ఇట్టి సమస్యలపై నిర్లక్ష్యము మంచిది కాదని ప్రజల పక్షాన కోరడం జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బిఎస్పి నాయకులు వేల్పుల రాజు, బిజెపి & బి. సి సంక్షేమ సంఘం నాయకులు గాదాసు రాంప్రసాద్, బిజెపి & బి. సి సంగం సీనియర్ నాయకులు వరియోగుల అనంతస్వామి పాల్గొన్నారు.