హుస్నాబాద్ లో ఘనంగా భారతరత్న పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో మాజీ ప్రధాని, భారత రత్నా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…
తెలంగాణ ముద్దు బిడ్డ, హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు, ఈదేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఎంతోపేరు తెచ్చిన వ్యక్తి అని అన్నారు.
వంగర లో జన్మించిన వ్యక్తి పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.
వారు చూపిన మార్గదర్శకంలో మేమంతా నడవాలని కోరుకుంటున్న, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల తెచ్చి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చిన వ్యక్తి.. విద్యకు ప్రాధాన్యత తెచ్చిన వ్యక్తి..అయన దేశ ప్రధానిగా చేసిన సేవలు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు , కార్యకర్తలు.


