చిన్నారి నీ రైల్వే బోగీలో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు
సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:
: తల్లిపాలు కూడా మరువని 15 నెలల చిన్నారిని రైల్వే బోగీలో తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయారు. కాచిగూడ నుంచి మెదక్ వెళ్తున్న రైలులో ఎస్ 9వ కోచ్ లో ఏడుస్తున్న చిన్నారిని గుర్తించి స్థానిక వడియారం రైల్వే స్టేషన్ లోని స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే స్టేషన్ మాస్టర్ కామారెడ్డి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ తావు నాయక్ కు సమాచారం అందించారు. చిన్నారి లభ్యత విషయంపై మెదక్ జిల్లా బాలల సంరక్షణ అధికారులు అశోక్, మంజుల, రమేష్ లకు సమాచార అందించి చిన్నారిని జిల్లా సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్నారికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే జిల్లా సంరక్షణ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.