కార్యకర్తలకు అండగా BRS పార్టీ – మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ లోని BRS పార్టీ కార్యాలయం లో చిగురుమామిడి మండలం నవాబ్ పెట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బొయిని వెంకటయ్య ప్రమాదవశాత్తూ మరణించగా BRS పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామినీ గా ఉన్న కుమారుడు BRS పార్టీ చిగురుమామిడి మండల BRSV అధ్యక్షులు బోయిని మనోజ్ కి చెక్కును మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.