హుస్నాబాద్ లో నిర్వహిస్తున్న జాబ్ మేళా కోసం వేలాదిగా తరలి వచ్చిన నిరుద్యోగ యువత
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం, బిసి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహిస్తున్న “మెగా జాబ్ మేళా” కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన నిరుద్యోగ యువత.
హుస్నాబాద్ లో జరుగుతున్న మెగా జాబ్ మేళా కు దాదాపు 60 కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి. 5000 ఉద్యోగాల నియామకం చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.
జాబ్ మేళా కి వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి హెల్త్ క్యాంప్ లు, బోజన వసతులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు.



