సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో పాల్గొన్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ జాబ్ మేళాను జీరో నుండి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులు వారికి అనుగుణమైన ఉద్యోగ అవకాశం కోసం వివిధ కంపెనీలు ఇక్కడ వచ్చాయని, వాటిని నిరుద్యోగులు వారి అవకాశాన్ని బట్టి ఎంచుకొని ఉద్యోగం పొందాలని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ మనుచౌదరి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి.. చైర్మన్ ఆకుల రజిత
