మృతుని కుటుంబానికి పొన్నం ప్రభాకర్ భరోసా
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
హుస్నాబాద్ లో జరిగిన ఆర్టీసీ బస్ ప్రమాదం లో మృతి చెందిన కోహెడ మండలం రామచంద్రా పూర్ గ్రామానికీ చెందిన జెరిపోతుల రాములు ( దావా రాములు) కుటుంబ సభ్యులకు స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, దహన సంస్కార నిమిత్తం మృతుని భార్య జ్యోతి కి 10,000 రూపాయలు (ఆర్థిక సాయం) కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతో పంపించారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని, పొన్నం ప్రభాకర్ అమెరికా నుండి తెలిపారు.
Posted inహుస్నాబాద్
మృతుని కుటుంబానికి పొన్నం ప్రభాకర్ భరోసా
