సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం డప్పు చప్పుల నడుమ బోనంతో ఊరేగింపుగా ఎల్లమ్మ ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం, పట్నం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రికి దేవాలయ ఈవో ఎల్లమ్మ తల్లి ప్రతిమను బహుకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…ఎల్లమ్మ తల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.