వరుణుడి కరుణకోసం కప్పతల్లి ఆటలు..
రోకలికి కప్పని కట్టి చిన్నారుల భిక్షాటన..
వారిని దేవుళ్లుగా భావిస్తున్నా గ్రామస్తులు..
సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్
మొదట మురిపించి వరుణుడు ఒక్కసారిగా మొఖం చాటేయ్యడంతో వరుణుడు కరుణించాలని నేడు చిన్నారులకు పాఠశాలకు సెలవు రావడంతో జగదేవపూర్ మండలంలోని బిజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు వారి తల్లిదండ్రులు ఇంట్లో కూర్చోని వారు అప్పులు చేసి వేసిన విత్తనాలు మొలకెత్తక పోవడంతో వారు వారు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అయోమయంలో ఉండడంతో చిన్నారులు వారి బాధలను గమనించి వారికి ఏదో ఒకరంగా వారి తోడుండాలని ఆలోచించి చిన్నారులంతా ఒక్కటై రొకలికి కప్పలను వేప కొమ్మలను కట్టి మొదటగా గ్రామ దేవతల వద్దకు వెళ్లి పూజలు చేసి వర్షాలు కురువాలని మొక్కులను మొక్కి ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లి, కప్పతల్లి కడుపునిండా నీళ్లు పోయి, వాన దేవుడా.. వర్ష దేవుడా అంటూ చిన్నారులు భిక్షాటన చేశారు వారికి గ్రామంలో వారిని వచ్చిన చిన్నారులను వారే దేవవుళ్ళు గా భావించి వారి వెంట తెచ్చుకున్న కప్పలకు బిందెలతో నీళ్లు పోసి గ్రామంలోకి స్వాగతం పలికారు.అనంతరం వర్షాలు కురువాలని గ్రామ దేవతలకు మొక్కులు మొక్కారు.





