జర జాగ్రత్త సుమా.. కూల్ డ్రింక్ లో పంగస్.. మీ ఆరోగ్యం డమాల్..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట;
జర జాగ్రత్త సుమా.. మీరు కొనుగోలు చేసే తినుబండరాలు ఒక సారి సరి చూసుకుని తీసుకోవాలి లేదంటే మీ ఆరోగ్యం అంతే.. ఒ వైపు కల్తీ.. మరో వైపు కాలం చెల్లిన వస్తువుల విక్రయాలతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు..
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్‌పురా కాలనీలో కల్తీ కలకలం రేపింది. కాలనీకి చెందిన రామంచ గణేశ్ తన కూతురుకు మాజా తీసుకురావడానికి పక్కనే ఉన్న ఓ కిరాణా జనరల్ స్టోర్‌కు వెళ్లాడు. మాజా తీసుకుని ఇంటికెళ్లి తన కూతురుకు ఇచ్చాడు. పాప తాగాడానికి ప్రయత్నించగా అందులోనుంచి మాజా బయటకురాలేదు. దీంతో తండ్రికి చెప్పింది. గణేశ్.. మజా మూత తీసి పరిశీలించగా అందులో గడ్డలు కట్టిన బూజు కనిపించింది. మాజా రంగు కూడా పూర్తిగా నలుపు రంగులో ఉంది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న గణేశ్ వెంటనే సంబంధిత షాపులోకి వెళ్లి.. యజమానిని నిలదీశాడు. ఆయన తనకేం తెలియదని.. అంతా డిస్ట్రిబ్యూటర్దేనని చెప్పాడు. ఎక్స్పైరీ డేట్ ఉన్నా.. డ్రింక్ కల్తీ కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేయగా రేపు షాపునకు వచ్చి మాట్లాడుతానని తప్పించుకున్నాడు. స్థానికులు పదేపదే ఫోన్ చేయడంతో నేను పార్టీలో ఉన్నానంటూ ఫోన్ కట్ చేశాడు. కల్తీతో తయారుచేయడం వల్లనే మాజా బూజు పట్టిందని స్థానికులు ఫైర్ అవుతున్నారు.





