హుస్నాబాద్ ఎల్లమ్మ దేవస్థానానికి గెస్టహౌస్ ల నిర్మాణం గురించి నిధులు వెంటనే కేటాయించాలి
ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి
భారతీయ కిసాన్ జిల్లా ఉపాధ్యక్షులు కవ్వ వేణుగోపాల్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధిగాంచిన హుస్నాబాద్ ఎల్లమ్మ టెంపుల్ యందు గెస్ట్ హౌస్ లు లేక భక్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తుల యొక్క ఇబ్బందులకు తీర్చుటకు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నంప్రభాకర్ ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి ఎల్లమ్మ దేవస్థానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని భారతీయ కిసాన్ జిల్లా ఉపాధ్యక్షుడు కవ్వ వేణుగోపాల్ రెడ్డి కోరారు.
హుస్నాబాద్ ఎల్లమ్మ దేవస్థానానికి దాదాపు ఒక ఎనిమిది జిల్లాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వారికి పూర్తిస్థాయిలో సదుపాయం లేకుండా చెట్ల క్రింద అసౌకర్యాలు నడమ మొక్కులు చెల్లించుకుంటూ వండుకోవడం జరుగుతుంది అని, ఇలాంటి పరిస్థితులలో భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించుటకు గెస్ట్ హౌస్ల నిర్మాణాలు చేపట్టాలని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ని కోరారు.
రోజు రోజుకు భక్తుల యొక్క సంఖ్య పెరగడంతో తీవ్ర ఇబ్బందులు కలుగుచున్నవి అని దీనిని దృష్టిలో ఉంచుకొని శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.