మెదక్ లో ఉద్రిక్తత..
గోవులను తరలిస్తుండగా అడ్డుకున్న బీజేవైఎం.. నాయకులు..
రాళ్ళు, కర్రలతో ఇరు వర్గాల పరస్పర దాడులు..
సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:
మెదక్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం నాయకులు గోవులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లా కేంద్రంలో రెండు వర్గాలు, పరస్పర దాడులు పోలీసుల లాఠీ చార్జి తో మెక్ పట్టణం అట్టుడికింది. జిల్లా ఎస్పీ బాలస్వామి, డిఎస్పీ, సీఐ లు, పోలీస్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగి శాంతి భద్రత లను అదుపు లోకి తెచ్చారు. వివరాలు ఇలా వున్నాయి.. బీజేవైఎం నాయకులు ఉదయం నుండి గోవులను తరలిస్తున్న, వదిస్తున్న వారిని పట్టుకోవడంతో గొడవ ప్రారంభమైంది. ముందుగా అలర్ట్ కావలసిన పోలీసులు ఉదయం కొంత ఉదాసీనంగా వ్యవహరించడంతో గొడవలు, చిలికి, చిలికి గాలి వాన లా తయారైంది. బీజేవైఎం నాయకులు గోవులను ఆడ్డు కోవడంతో మరొక వర్గం బీజేవైఎం నాయకులపై దాడుల దిగింది. దీంతో బీజేవైఎం నాయకులు కర్రలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. మరో వర్గం జరిపిన దాడిలో బీజేవైఎం నాయకునీ పై కత్తి తో దాడి చేయడంతో గొడవ ప్రారంభమైంది. పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు. దీంతో పోలీస్ లు లాఠీ ఛార్జి చేసి ఇరు వర్గాల ను చదుర గొట్టారు. పట్టణంలో పోలీస్ లు 144 సేక్షన్ విధించారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేశారు. ఇంకా పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.








