సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ లోని బంజారా భవన్ లో శనివారం రోజు గిరిజన నాయకుల ఆధ్వర్యంలో వంట్టవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ బంజారా భవన్ కు రోడ్డును వెంటనే నిర్మించాలని మరియు రోడ్డుకు అడ్డంగా నిర్మించినటువంటి ఇళ్లను తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు. లేనియెడల నిరాహార దీక్షలు చేపడతామని, వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు నిరాహార దీక్షలు చేస్తమని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు నిరసనగా 10 రోజులపాటు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన రోడ్డు నిర్మించాలని, ఈ దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతు సత్యం నాయక్, గిరిజన అభివృద్ధి సంఘం అధ్యక్షుడు వీరన్న నాయక్, కాంగ్రెస్ గిరిజన నాయకుడు చంద్రు నాయక్, శ్రీనివాస్ నాయక్, శీను నాయక్, గోర్ సేన రాజు నాయక్, పవర్, రాజయ్య నాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.