అక్కన్నపేట: మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట్ మండలం,పంతుల్ తండా లొ కారంటోతు కవిత, స్వరూప బస్సు యాక్సిడెంట్లో ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని శనివారం వారి కుటుంబ సభ్యులను మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు. అనంతరం వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు, వారి ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, జడ్పీటీసీ భూక్య మంగ, మాజీఏఎంసీ ఛైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.