హుస్నాబాద్: బంజారా భవన్ నిర్మాణానికి అడ్డంకులు
అక్రమ నిర్మాణాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి
లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతు సత్యం నాయక్, గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్య వీరన్న నాయక్


సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రెండు కోట్ల నిధులతో నిర్మిస్తున్న బంజారా భవన్ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న బడా నాయకుల వైఖరిని గిరిజన సంఘం నాయకులు తప్పుబట్టారు. బంజారా భవన్ వెళ్లే రోడ్డుకు అడ్డంగా రాత్రికి రాత్రే ఇండ్లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని గిరిజన నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అక్రమ నిర్మాణాల విషయమై మున్సిపల్ కమిషనర్ కు గిరిజన నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. మంత్రి చూపిన చొరవకు గిరిజన నాయకులు ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో పాటు బంజారా భవన్ నిర్మాణానికి మరిన్ని విధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతు సత్యం నాయక్, గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్య వీరన్న నాయక్, మాలోతు శ్రీనివాస్ నాయక్, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.



