సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్.
వన మహోత్సవం లో భాగంగా మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి, ఇతర అధికారులు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో సేషన్ ను పరిశీలించారు. పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బాసర ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 75 సంవత్సరాలుగా జరుగుతున్న వన మహోత్సవం లో భాగంగా హుస్నాబాద్ మోడల్ స్కూల్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల, ఇతర అధికారులు, విద్యార్థులు భాగస్వామ్యం అయ్యారని, అందరికీ 75 వ వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్క నాటడమే కాదు వాటిని పెద్దగా అయ్యే వరకు పెంచాలని అన్నారు.
మాస్క్ కట్టుకునే పరిస్థితి రావద్దంటే, ఆక్సీజన్ కొనుక్కునే పరిస్థితి రాకుండా, రాబోయే తరానికి ఇబ్బందులు రాకుండా వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే అందరం చెట్లు నాటి సంరక్షించుకోవాలని అన్నారు.
మనకు జన్మనిచ్చిన సమాజం లో బాధ్యతగా వ్యవహరించే ఈ పాఠశాల నుండి ఇలాంటి సామాజిక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి దానిలో మనమంతా పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని, ఉదాసీనత పనికిరాదని, పోరాట పటిమ తో బతికిన వారికే చరిత్ర ఉంటుంది అని అన్నారు.
వన మహోత్సవం లో హుస్నాబాద్ నియోజకవర్గం తో పాటు సిద్దిపేట జిల్లాల్లో 21 లక్షల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ నిర్ణయించిందని, రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గ శాసన సభ్యుడి గా చెప్తున్న ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, ఈరోజు జిల్లా కలెక్టర్ జన్మదినం, ఆయన జన్మదినం సందర్భంగా మొక్క నాటినట్టు మీరు కూడా జన్మదినలకు చెట్లు నాటాలని అన్నారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మూడు జిల్లా కలెక్టర్ లతో రివ్యూ పెట్టిన, మీ ఆశీర్వాదం, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యానన్నారు.
నిన్న రాత్రి గురుకుల పాఠశాల లో విద్యార్థులతో కలిసి భోజనం చేశా..మీ స్కూల్ కి కూడా వచ్చి మీతో కలిసి భోజనం చేస్తా అని ముగించారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్, హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.