సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామ అభివృద్ధికి 4.70 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామం సర్వాయిపేట గ్రామ అభివృద్ధికి టూరిజంశాఖ నుండి మొదటి దశ లో4.70 కోట్లు నిధులు మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..సర్వాయిపేట కోట అభివృద్ధి తో పాటు సర్వాయిపేట నుండి కిలాష్ పూర్ కోట వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలు పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి కోసం 4.70 కోట్ల విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు కృతజ్ఞతలు తెలిపారు.
సర్వాయి పాపన్న గౌడ్ నడియాడిన ప్రాంతాలను టూరిజం గా అభివృద్ధి చేసుకుంటే దేశ విదేశాలకు కూడా ఆయన జీవిత చరిత్ర తెలుస్తుందని, నేటి యువతకు సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర స్ఫూర్తి దాయకంగా ఉంటూ ఆ ప్రాంతాలు టూరిజంగా మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.