హుస్నాబాద్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :


సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా నియోజకవర్గం జేఏసీ ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సర్వాయి పాపన్న కల్లు గీత, గౌడ నిరుపేద కుటుంబం లో పుట్టి గోల్కొండ సంస్థానాన్ని పాలించాడని, 17వ శతాబ్దం లోనే బహుజన రాజ్యాన్ని స్థాపించాడని, సామాజిక న్యాయం ను తన పాలన లో అమలు చేశాడన్నారు. ఈ పోరాట యోధుల వలెనే ప్రజాస్వామ్యం బలపడి, స్వేచ్ఛ దొరికిందన్నారు. ప్రపంచ చరిత్ర లో తెలంగాణ కు చరిత్ర ఉంటే అందులో హుస్నాబాద్ నియోజకవర్గం నకు ప్రత్యేక పోరాట చరిత్ర ఉందన్నారు. సర్వాయి పాపన్న పోరాటాలు, తెలంగాణ రైతంగా సాయుధ పోరాటాలు, మందాపూర్ అమరులు, హుస్నాబాద్ అమరుల స్థూపం ప్రపంచ చరిత్ర లో లిఖించ బడి, ఆ స్ఫూర్తి ని ప్రజలు కొనసాగిస్తున్నారని, ప్రజలే చరిత్ర నిర్మాతలని హుస్నాబాద్ ప్రజలు నిరూపిస్తున్నారని అన్నారు. సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని, యువత ముందుండాలని అన్నారు. అపుడే సర్వాయి పాపన్న కు నిజమైన నివాళిని అర్పించినట్లవుతుందని అన్నారు.


ఈ కార్యక్రమం లో హుస్నాబాద్ నియోజకవర్గ JAC కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేడం లింగమూర్తి, బోలిశెట్టి శివయ్య, హాసన్, కోమటి సత్యనారాయణ,కాంగ్రెస్ హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంక చందు,కౌన్సిలర్లు వల్లపు రాజు, భూక్య సరోజన, CPI సీనియర్ నాయకులు గడిపే మల్లేష్, సంజీవరెడ్డి,BJP సీనియర్ నాయకులు బొమ్మ గాని సతీష్, భూక్య సంపత్ నాయక్, హుస్నాబాద్ నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షులు మార్క అనిల్ గౌడ్, OU JAC నాయకులు గంపల శ్రీనివాస్, JAC నాయకులు కోహెడ కొమురయ్య వెన్న రాజు, ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, ఎదులాపురం తిరుపతి, వడ్డేపల్లి మల్లేశం, మండల జంపన్న, బుర్ర రమేష్, కాంగ్రెస్ నాయకులు పచ్చిమట్ల రాధ, కమలవ్వ, శ్రీలత, నాయిని రజిత, భువనగిరి రజిత, గడిపే రమ, బాలు, మైదాంశెట్టి వీరన్న, బొంగోని శ్రీనివాస్, పోలు సంపత్, గట్టు రాములు, కాశబోయిన సాంబరాజు, కైలు నాయక్, కేశవేణి రమేష్, పూదరి శ్రీనివాస్, బొమ్మగాని అంజయ్య,పిల్లి తిరుపతి,అలువోజు రవీందర్, కొత్తపల్లి సత్యనారాయణ, నాగారం కుమార్,తదితరులు పాల్గొన్నారు.