సిద్దిపేట టైమ్స్ ఎఫెక్ట్..
150 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకడంపులను సీజ్
అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు..
చేర్యాల సీఐ శ్రీను, తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్..
సీజ్ చేసిన ఇసుక ఈనెల 27న వేలం..
సిద్ధిపేట టైమ్స్,మద్దూరు:
ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో మోయతుమ్మెద వాగులో నుండి ట్రాక్టర్ యజమానులు పగటిపూట అక్రమంగా ఇసుకను తరలిస్తూ గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఇసుక డంపులను ఏర్పాటు చేసుకొని,రాత్రివేళలో చుట్టుపక్కల గ్రామాలకు ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకోవడంతో సోమవారం “జాలపల్లిలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా” అని “సిద్ధిపేట టైమ్స్ లో” వచ్చిన వార్తకు రెవెన్యూ,పోలీసు అధికారులు స్పందించారు.మంగళవారం ధూళిమిట్ట తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్,చేర్యాల సీఐ లక్కెపురం శ్రీను 150 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులను జాలపల్లి గ్రామంలో సీజ్ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
ధూళిమిట్ట తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్
గ్రామంలోని ట్రాక్టర్ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారిపై వాల్ట చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్యామ్ తెలిపారు.స్వాధీనం చేసుకున్న ఇసుకను ఈనెల 27న(గురువారం)వేలం వేయనున్నట్లు తెలియజేసారు.