ఘనంగా భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి 121వ జయంతి వేడుకలు
పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
భారత మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి 121వ, జయంతి వేడుకలు కోహెడ మండల కేంద్రంలో ప్రముఖ సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా… సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ ఆవరణలో ఉన్నా శాస్త్రి విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రవేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణి చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ” జై జవాన్ – జై కిసాన్” నినదానికి ప్రాణం పోసిన ధీరుడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర దారుడు ఇండో – పాకిస్థాన్ యుద్ధ కాలంలో మన దేశాన్ని నడిపించిన రాజానీతజ్ఞడు మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి గా, హోమ్ మంత్రి గా సమర్ధ పాలనను అందించిన దేశ్యాదక్షుడు అంతటి రాజనీతి గల భారతదేశ 2వ, ప్రధాని నేడు జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది. అ మహనీయునీ బాటలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. గత పదిహేను ఏళ్ళు గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ని తీగలకుంటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పొన్నాల శంకర్, హుస్నాబాద్ నియోజకవర్గం ఎన్. ఎస్. ఐ అధ్యక్షులు సనత్ రెడ్డి లు అభినందించారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు ముంజ సదానందం గౌడ్, పెరియాల సంతోష్ రావు, బాబయ్య, లింగచారి, మహిళా సంఘం నాయకులు మోతే మాధవి తదితరులు పాల్గొన్నారు.