ఈరోజు నుండి మద్యం తాగి వాహనం నడిపితే ₹10,000 జరిమానా
మద్యం ప్రియులు జాగ్రత్త… హుస్నాబాద్ ఏసీపీ సదానందం హెచ్చరిక
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్ ఏసీపీ సదానందం హెచ్చరించారు. ఈ రోజు నుండి మద్యం తాగి వాహనం నడిపితే ₹10,000 జరిమానా విధించబడుతుందని తెలిపారు. ఏసీపీ సదానందం మాట్లాడుతూ — “ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి. మద్యం సేవించి వాహనం నడపడం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా ప్రాణాలకు ముప్పు కూడా. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ఎటువంటి ఉపేక్షణ ఉండదు” అని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులు తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తారని హెచ్చరించారు. ప్రజలు రోడ్డు భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా మద్యం సేవించి డ్రైవ్ చేయకుండా ఆపాలని సూచించారు. ట్రాఫిక్ విభాగం ఈ చర్యలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, ప్రజల ప్రాణాలు కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని ఏసీపీ తెలిపారు.
Posted inబ్రేకింగ్ న్యూస్ హుస్నాబాద్
ఈరోజు నుండి మద్యం తాగి వాహనం నడిపితే ₹10,000 జరిమానా!..





